టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి వాకిటి

టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి వాకిటి

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 22 :  హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితులై తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన బీ.ఎం. సందీప్ గారిని మంత్రి వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం వంటి అంశాల ప్రాధాన్యాన్ని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.