పంట రుణాల రీషెడ్యూల్‌’కు ఎస్ఎల్బీసీ గ్రీన్ సిగ్నల్


పంట రుణాల రీషెడ్యూల్‌’కు ఎస్ఎల్బీసీ గ్రీన్ సిగ్నల్

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 29 :

 

ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ‘ఏర్పడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరవుతో ప్రభావితమైన 365 మండలాల్లో పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఎంతో మంది రైతులకు ఎంతో ఉపశమనం కలగనుంది. అన్ని జిల్లాల్లోనూ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.