– TGIICలో చీఫ్ ఇంజనీర్ ఇష్టారాజ్యం
– అనుమదీయులకే కంట్రాక్టుల అప్పగింత
– ఎలాంటి అర్హతలు లేని కంపెనీలకు కాంట్రాక్టులు
– సిద్దీపేట జిల్లా వర్గల్ ఫుడ్ పార్క్ లో భారీ అవకతవకలు
– దాదాపు యాబై కోట్ల టెండర్ల గోల్ మాల్
– తప్పుడు పత్రాలు సృషించి స్వయంగా టెండర్లు ఓపెన్ చేసిన సీఈ
– టెండర్లు వేసిన ఒరిజినల్ కాంట్రాక్టర్లకు దక్కని వైనం
– ఇష్టారాజ్యంగా సీఈ వ్యవహారశైలి
హైదరాబాద్ వెలుతురు జూలై 02:
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)లో అవినీతి రాజ్యామేలుతోంది. కొంతమంది ఉన్నతాధికారుల చేతి వాటం వల్ల సంస్థ తీవ్రంగా నష్టపోవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్తుంటే ఇంకోవైపు అధికారుల తీరు అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా టీజీఐఐసీ లో సీఈపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వెల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న సంస్థలో ఎలాంటి అర్హతలు లేని కంపెనీలకు కాంట్రాక్టులు అప్పనంగా ఇచ్చి భారీ మొత్తంలో కమిషన్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా వర్గల్ ఫుడ్ పార్క్‌కు సంబంధించిన వ్యవహారంలో దాదాపు యాబై కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. అర్హత లేని కంపెనీకు నేరుగా సీఈనే తప్పుడు పత్రాలు సృష్టించి స్వయంగా టెండర్లు ఓఎన్ చేసినట్లు సమాచారం. దీనిమీద సదరు కాంట్రాక్టర్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు పిర్యాదు చేశారు. ప్రభుత్వం, సంబంధిత మంత్రి తక్షణమే స్పందించి సీఈ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకొని అక్రమార్గంలో వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నా ఇలాంటి వారిపై ఎసిబి ద్రుష్టి పెడితే బాగుంటుంది అంటున్నారు.
