కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి

ఢిల్లీ, వెలుతురు (జూన్ 25):

నీట్ పరీక్షల వివాదం, దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.

ప్రహ్లాద్ జోషి 2004 నుంచి కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అంతకుముందు 2019 నుంచి 2024 మధ్య బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.