హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 02:
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అమ్మవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.
అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


