సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పారాయణాలు

జహీరాబాద్ వెలుతురు, అక్టోబర్ 05: దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ సంతోషిమాత ఆలయంలో జరిగిన దుశ్చర్యకు నిరసనగా జహీరాబాద్‌లోని శ్రీ సంతోషిమాత మందిరంలో సోమవారం ప్రత్యేక పారాయణాలు నిర్వహించారు. సౌందర్యలహరి, దుర్గా సప్తశ్లోకి, శివానందలహరి, లలితా సహస్రనామ పారాయణాలు చేశారు. ఆలయాలపై భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా ఉండాలని, ఘటనకు ప్రాయశ్చిత్తంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌ ఘటనకు పాల్పడిన దుండగులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.