- దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళి
- బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు తెలంగాణ ఎన్నారైలు
- ముఖ్య అతిథిగా హాజరైన వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం
లండన్, వెలుతురు, అక్టోబర్ 5:
ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే విస్తృత కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించారు. యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళి
ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే సభ్యుడు శ్రీనాథ్‌రెడ్డి చిత్రపటాలకు నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరులు, ప్రొఫెసర్ జయశంకర్‌ను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతికి అధ్యక్షుడు నవీన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేయగా, శ్రీనాథ్‌రెడ్డి అకాల మరణంపై అశోక్‌గౌడ్ సంతాప సందేశం తెలిపారు.
బీఆర్‌ఎస్‌లోకి పలువురు ఎన్నారైలు
యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు తెలంగాణ ఎన్నారైలు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నూతన సభ్యులకు అనిల్ కూర్మాచలం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే ఆకాంక్షతోనే తాము పార్టీలో చేరినట్లు నూతన సభ్యులు తెలిపారు.
ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే మాజీ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి మాట్లాడుతూ యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు బీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరమన్నారు.
సోషల్ మీడియా కార్యక్రమాలపై దృష్టి
ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంఘీభావంగా యూకేలోని ఎన్నారై బీఆర్‌ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు, లండన్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
16 ఏళ్లుగా ఎన్నారై బీఆర్‌ఎస్ సేవలు
ఎన్నారై బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా లండన్‌లో ఎన్నారై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ ఎన్నారైలు పార్టీకి అందిస్తున్న సేవలను వివరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, పార్టీ నాయకత్వం ఎన్నారైలను ప్రోత్సహిస్తోందన్నారు.
ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అడ్వైజరీ బోర్డు చైర్మన్ సీకే చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఎన్నారై బీఆర్‌ఎస్ కార్యకర్తలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలపై పోరాటం
ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే ఉపాధ్యక్షులు రవి కుమార్ రేతినేని, సత్యమూర్తి చిలుముల, సతీష్‌రెడ్డి గొట్టెముక్కుల మాట్లాడుతూ ఎన్నారైలకు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్‌ఎస్ రాజకీయ కార్యకలాపాలతో పాటు సభ్యుల మధ్య పరస్పర సహకారానికి వేదికగా కొనసాగుతోందన్నారు.
బీఆర్‌ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
బీఆర్‌ఎస్ యూకే కార్యదర్శి–ఐటీ, మీడియా, పీఆర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలను గణాంకాలతో విశ్లేషిస్తూ ప్రశ్నిస్తున్నామని, రానున్న రోజుల్లో సోషల్ మీడియా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని అన్నారు.
ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే యువజన విభాగం కన్వీనర్ ప్రశాంత్ మామిడాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు.
మైనారిటీ సెల్ నాయకుడు అబ్దుల్ జఫర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే యువజన విభాగం కో-ఆర్డినేటర్ అమరేశ్వరి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
పలువురు నాయకుల పాల్గొనడం
ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే కార్యదర్శి సురేష్ గోపతి స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి వందన సమర్పణతో సమావేశం ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ జెల్ల, గణేష్ కుప్పాల, శ్రీధర్‌రావు తక్కళ్లపల్లి, ప్రవీణ్ వీర, సురేష్ బుడగం, సత్యపాల్‌రెడ్డి పింగలి, నవీన్ మాదిరెడ్డి, రాజేష్ వర్మ, ప్రశాంత్‌రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, శివగౌడ్, అంజన్‌రావు, పవన్‌కుమార్‌గౌడ్, తరుణ్ లునావత్, లావణ్య, సాయికిరణ్ కనుగుల, సాకేత్, జనార్దన్, స్నేహిత్‌రావు, అనిల్ రాచమల్ల, సంకేత్‌రెడ్డి, మణీందర్‌రెడ్డి, శ్రీహరి, జయపాల్‌రెడ్డి, రాజు యాదవ్, అజయ్, ప్రసన్నకుమార్, వికాస్ పర్రె, రాహుల్, మహేష్, అశ్వల్, శ్రీకాంత్, అస్లాన్, విజయ్, రమేష్, హర్షవర్ధన్, సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.






