మహబూబ్‌నగర్ ఎన్‌టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్‌లోని ఎన్‌టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్  ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించింది. అనంతరం విద్యార్థులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని, వారితో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.