ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ నిరసన.. జహీరాబాద్‌లో రాస్తారోకో

జహీరాబాద్ వెలుతురు, అక్టోబర్ 08: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జహీరాబాద్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. యూత్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి-161పై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ అరెస్టు అప్రజాస్వామికమని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని కోరారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ రాములు, ప్రతాప్‌రెడ్డి, మల్లికార్జున్‌, జగదీశ్వర్‌రెడ్డి, నరేష్‌ బబ్లూ, విష్ణువర్ధన్‌రెడ్డి, ధర్మునాయక్‌, కిరణ్‌కుమార్‌గౌడ్‌, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.