రేవంత్‌రెడ్డిని బద్నాం చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రత్యేక టాస్క్: మెట్టు సాయి
హైదరాబాద్: బీఆర్‌ఎస్ అంటే భజన రాష్ట్ర సమితి, బట్టేబాజ్ రాష్ట్ర సమితి, బానిస రాష్ట్ర సమితి అని టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులు కేసీఆర్‌ను, మరో రెండు రోజులు కేటీఆర్‌ను పొగడటం, రేవంత్‌రెడ్డిని తిడితే రూ.100, కాంగ్రెస్‌ను విమర్శిస్తే రూ.50, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడితే రూ.500 చొప్పున చెల్లించేలా బీఆర్‌ఎస్ భజన బృందానికి టాస్క్ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని బద్నాం చేసేందుకు బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రత్యేక టాస్క్ ఇచ్చిందని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు వేసే ప్రతి రాయితో రేవంత్‌రెడ్డి మరింత బలమైన గోడ కడుతున్నారని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లు రేవంత్‌రెడ్డికి చిక్కకుండా, దొరకకుండా తప్పించుకోలేరని, వారిని రాజకీయంగా వదిలిపెట్టేది లేదని అన్నారు. రేవంత్‌రెడ్డిపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఆయన వెనక్కి తగ్గరని మెట్టు సాయి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చీడపీడలను తెలంగాణ నుంచి ప్రజలు బహిష్కరిస్తారని, కేటీఆర్, హరీశ్‌రావులను రాజకీయంగా బొందపెట్టినప్పుడే ఆ చీడపీడ పూర్తిగా పోతుందని వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కల్వకుంట్ల కుటుంబం కంటున్నవి పగటి కలలేనని అన్నారు.
