తాటి కృష్ణవేణిని శాలువాతో సత్కరించిన మంత్రి

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 14 : సీనియర్ మహిళల టీ-20 ట్రోఫీకి హైదరాబాద్ జట్టు తరఫున ఎంపికైన తాటి కృష్ణవేణిని రాష్ట్ర మంత్రి సీతక్క అభినందించారు. ప్రజాభవన్‌లో కృష్ణవేణిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీలో ప్రతిభ చాటుతూ హైదరాబాద్ జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. క్రీడా రంగంలో మహిళలు రాణించడం సంతోషకరమని, కృష్ణవేణి తన ప్రతిభతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మహిళా క్రికెట్ రంగంలో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సీతక్క కృష్ణవేణికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సాధించిన విజయాలు ఇతర యువతులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.