బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల, వెలుతురు, అక్టోబర్ 14: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో వ్యవసాయ బావిలో పడి ఇద్దరి యువకులు మృతి చెందిన సంఘటన బుధవారం వేకువ జామున చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేందుకు ఈ వారంలో చింతకుంటకు వచ్చారు.మంగళవారం రాత్రి పని ముగించుకుని గ్రామ శివారులో గల వ్యవసాయ బావి వద్ద మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఒకరు ఆనంద్ బాబు (23) మరో యువకుడు సంజీవ్ (22) గుర్తించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రవి కిరణ్ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
