మంత్రి సీతక్కను కలిసిన జిల్లా సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ నూతన కార్యవర్గం

మంత్రి సీతక్కను కలిసిన జిల్లా సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ నూతన కార్యవర్గం

హైదరాబాద్, అక్టోబర్ 14 ; ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్కను జిల్లా సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావుతో పాటు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ కరణ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ నర్సింహాలు, ట్రెజరర్ నవీన్, వైస్ ప్రెసిడెంట్లు ప్రవీణ్, సబిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకయ్య తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఈవోలు డిప్యూటీ సీఈవోలు డి ఆర్ డి ఓ అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు, వాటి వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని మంత్రి సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతూ, క్షేత్రస్థాయిలో సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అధికారులు చొరవ చూపాలని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా కష్టపడి పనిచేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. సమర్థవంతమైన పనితీరు, అంకితభావం, సమన్వయంతోనే శాఖ లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు. మంత్రి సీతక్కను కలిసిన సందర్భంగా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. శాఖ అభివృద్ధికి, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.