విదేశీ విద్య కోసం బీసీ, ఈబీసీ విద్యార్థులకు మరో అవకాశం

విదేశీ విద్య కోసం బీసీ, ఈబీసీ విద్యార్థులకు మరో అవకాశం..

దరఖాస్తు గడువు అక్టోబర్ 31 వరకు పొడిగింపు

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఉన్నత విద్య అభ్యసించండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్‌లో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును అక్టోబర్ 15, 2026 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాలామాయాదేవి తెలిపారు.

విదేశాల్లో మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులు అభ్యసిస్తున్న లేదా అభ్యసించాలనుకునే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హత ప్రమాణాలు:

1. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి కలిపి రూ.5 లక్షల లోపు ఉండాలి.

2. దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి విద్యార్థి వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.

3. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

4. GREలో 260 లేదా GMATలో 550 స్కోర్ కలిగి ఉండాలి.

5. TOEFLలో 60 లేదా IELTSలో 6.0 లేదా PTEలో 50 స్కోర్ కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం:

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వెబ్‌సైట్: https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do

దరఖాస్తులకు చివరి తేదీ: 31 అక్టోబర్ 2026.

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ పొడిగించిన గడువును వినియోగించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కోరింది.

Leave A Reply

Your email address will not be published.