ఖర్గేను కలిసిన మంత్రి వాకిటి
న్యూఢిల్లీ, వెలుతురు: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఢిల్లీలో నిన్న జరిగిన చలో సుప్రీంకోర్టు కార్యక్రమం నేపథ్యంలో ఖర్గేతో కాసేపు చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల హక్కులు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, సి ఈ సి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు సంబంధించిన అంశాలపై జాతీయ స్థాయిలో ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఇరువురు కాసేపు సమావేశమయ్యారు.
