కాళేశ్వరం పేరుతో హరీశ్‌రావుపై ఎంపీ చామల కౌంటర్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 27 : కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీటి లెవల్స్ గురించి తాను మాట్లాడితే హరీశ్‌రావుకు ఎందుకు కోపం వస్తోందని ప్రశ్నించారు. మేడిగడ్డ నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి వెళ్తోందంటూ బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని విమర్శించారు. హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ‘కూలేశ్వరం’గా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన తప్పిదాల కారణంగానే గోదావరి నీళ్లన్నీ కిందకు జారిపోయే పరిస్థితి ఏర్పడిందని చామల ఆరోపించారు.
