ఎల్‌నినో, కరువు పరిస్థితులపై రేపు అఖిలపక్ష భేటీ

ఎల్‌నినో, కరువు పరిస్థితులపై రేపు అఖిలపక్ష భేటీ

‎

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 27 :  రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆరో అంతస్తులోని గది నంబర్‌ 33లో ఈ సమావేశం జరగనుంది.

‎

‎రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం లోటు నేపథ్యంలో ప్రజలు, రైతులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటికి విద్యుత్‌ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వంటి కీలక అంశాలపై రాజకీయ పార్టీల నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

‎

‎కరువు నివారణకు అనుసరించాల్సిన వ్యూహాలు, అవసరమైన ముందస్తు చర్యలపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం కోరనుంది.

‎

Leave A Reply

Your email address will not be published.