కన్నేపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలి: జీవన్‌రెడ్డి

కన్నేపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలి: జీవన్‌రెడ్డి

 

హైదరాబాద్‌, వెలుతురు, అక్టోబర్ 27 : ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల కోసం కన్నేపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నీటిని ఎత్తిపోయేందుకు తగిన నీటిమట్టం లేకపోతే నెల రోజుల్లో కాఫర్‌ డ్యాం నిర్మించి నీటిని వినియోగించుకోవచ్చని సూచించారు. రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోస్తే ఐదు నెలల్లో 150 టీఎంసీలు వినియోగించుకోవచ్చన్నారు.

 

రైతులు వరి పంట సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పడం సరికాదని, నీరు, విద్యుత్‌ కోరబోమంటూ రైతుల నుంచి స్వీయ ప్రకటనలు తీసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, తుమ్మిడిహెట్టి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడలేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కె. విప్లవ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.