కరువుపై ఈరోజు అఖిలపక్ష భేటీ

కరువుపై ఈరోజు అఖిలపక్ష భేటీ

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28: తెలంగాణలో ఎల్ ని నో ప్రభావం, లోటు వర్షపాతం, కరువు పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సెక్రటేరియట్ భేటీ జరగనుంది. ప్రజలు, రైతులపై కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటికి విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై పార్టీల నేతల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.

Leave A Reply

Your email address will not be published.