ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిర్వహణపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిర్వహణపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 02 :  రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 19 నుంచి 22 వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ కార్యక్రమ ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల స్థితిగతులు, పురోగతి తదితర అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ శాఖ కార్యదర్శి ఇలాంబర్తి, ప్రత్యేక కార్యదర్శి గంగాధర్‌, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి శివశంకర్‌, ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్లు లింగారెడ్డి (అడ్మిన్‌), బి.వి.రావు, వసంత్‌నాయక్‌, ధర్మారెడ్డి, నర్సింగ్‌రావు, రాజేందర్‌, రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.