రోడ్డు పనులు చేస్తుండగా కరెంట్ షాక్.. 8 మంది మృ

రోడ్డు పనులు చేస్తుండగా కరెంట్ షాక్.. 8 మంది మృతి

 

జైపూర్, వెలుతురు, నవంబర్ 02 :  రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఝుంఝునూ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయ్‌పుర్‌వాటి ప్రాంతంలోని ఛాపోలీ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకపై రాజస్థాన్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

 

అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఛాపోలీ గ్రామంలో స్థానికుల సహకారంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు నిర్మాణానికి అవసరమైన కంకరను కలిపేందుకు ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కదమ్‌ కుండ్‌ వైపు వెళ్లే రహదారిపై పనులు జరుగుతున్న సమయంలో పైన ఉన్న 11 వేల వోల్టుల సామర్థ్యం కలిగిన హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు యంత్రం తగిలింది. దీంతో ఒక్కసారిగా అందులోకి కరెంట్‌ ప్రవహించింది. ఆ సమయంలో యంత్రం సమీపంలో పనిచేస్తున్న కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రమాదం ఎంత వేగంగా జరిగిందంటే, అక్కడున్న వారికి తేరుకునే అవకాశం కూడా లభించలేదు. ఒక్కసారిగా విద్యుత్‌ ప్రవహించడంతో కార్మికులు కుప్పకూలిపోయారు. వారి ఆర్తనాదాలతో ఘటనాస్థలం విషాదభరితంగా మారింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కరెంట్ షాక్కు గురైన వారిని ఆస్పత్రి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.