బేగంపేటకు చేరుకున్న అమిత్ షా
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 02 : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో హైదరాబాద్‌లో నేడు జరగనున్న మహా పాదయాత్ర కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ‘లోక్‌తంత్ర బచావో – అరాచకత హఠావో’ పేరుతో సాగే ఈ మహా పాదయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ఎంజే మార్కెట్ వరకు సాగనుంది. సర్‌కు వ్యతిరేకంగా దిల్లీలో విపక్షాలు చేపట్టిన ర్యాలీకి దీటుగా అమిత్ షా పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేసింది. అమిత్ షా రాకతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
