ఓటు హక్కుపై వేటు వేస్తే సహించం : ఉత్తమ్ కుమార్ రెడ్డి 

ఓటు హక్కుపై వేటు వేస్తే సహించం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

హైదరాబాద్, వెలుతురు నవంబర్ 03 :  ప్రజల ఓటు హక్కుకు గండి కొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన పౌరులను ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన నేదిక్కడ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో “సర్” ప్రక్రియలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఘాటుగా స్పందించారు.

 

ప్రతి అర్హ పౌరుడి ఓటుకు రక్షణ కల్పించడం, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు. నేడు హైదరాబాద్‌లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ అంశాలపై స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.