పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 03 :  అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు సరఫరాలో ఆటంకాలు, మార్కెట్ పరిణామాలు, రూపాయి మారకం విలువ, విలువైన లోహాలకు ఉన్న డిమాండ్‌లో మార్పులు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,190గా ఉండగా, మంగళవారం రూ.110 పెరిగి రూ.1,42,300కు చేరింది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇదే విధమైన ధరలు ఉన్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,27,750గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ స్పాట్‌ గోల్డ్‌ ధర 3,927 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

 

భారీగా తగ్గిన వెండి ధరలు

 

మరోవైపు వెండి ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌లో కిలో వెండి ధర రూ.1,85,271 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,700 తగ్గి రూ.1,83,571కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ స్పాట్‌ సిల్వర్‌ ధర 49.72 డాలర్ల వద్ద ఉంది.

Leave A Reply

Your email address will not be published.