రెండు హెలికాప్ట‌ర్లు ఢీ

 

ఖాట్మాండు, వెలుతురు, నవంబర్ 03 :  నేపాల్‌లో రెండు హెలికాప్ట‌ర్లు ఢీకొన్నాయి. ల్యాండింగ్ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. నేపాల్‌లోని సోలుకుంబు హెలిపోర్ట్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇవాళ‌ ఉద‌యం 8.11 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఫిష్‌టెయిల్ ఎయిర్‌, డైనాస్టీ ఎయిర్ సంస్థ‌ల‌కు చెందిన రెండు హెలికాప్ట‌ర్లు ల్యాండింగ్ స‌మ‌యంలో ఢీకొన్నాయని నేపాలీ పోలీసులు తెలిపారు. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని లుక్లా ఆస్ప‌త్రికి మ‌రో హెలికాప్ట‌ర్‌లో త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.