అగ్నివీర్‌లకు శుభవార్త..!

అగ్నివీర్‌లకు శుభవార్త..!

న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 04 :  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంలో భాగంగా అగ్నివీర్‌ల సేవా కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్. ఎస్. రాజా సుబ్రమణి తెలిపారు. ఈ పథకం కింద నాలుగేళ్ల ప్రాథమిక పదవీ కాలం ముగిసిన తర్వాత బయటకు వెళ్లాల్సిన 75 శాతం మంది అగ్నివీర్‌లకు అదనంగా మరో రెండేళ్లపాటు సేవలు అందించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఈ అదనపు రెండేళ్ల పొడిగింపు గడువు పూర్తైన తర్వాత ఆసక్తి గల ఆగ్నివీర్‌లు సాయుధ దళాల్లో చేరవచ్చని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సీడీఎస్ జనరల్ ఎన్.ఎస్. రాజా మీడియాకు బుధవారం తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.