బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 13 :

 

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఉనికి చాటుకునేందుకే విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దేశంలో ప్రేమ, ఐక్యత, సామాజిక న్యాయం పరిఢవిల్లాలని ఆకాంక్షించే నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ స్థాయికి బీజేపీ నాయకులు సరితూగరని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకే ఆయనను చూసి భయపడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఆలోచనలు, సందేశాలను ముందుకు తీసుకెళ్తామని, సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఆయన వెంట ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ముమ్మాటికీ సోనియా గాంధీయేనని, తాము రాసే ప్రతి పుస్తకంలో ఆమె పేరు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.