కొండగట్టు ఆంజనేయస్వామి మహా సంప్రోక్షణకు రావాలని డిప్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 17 : జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహించనున్న చందనోత్పాదన మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు దేవస్థానంలో నిర్వహించనున్న వివిధ ఆధ్యాత్మిక, వైదిక కార్యక్రమాల వివరాలను అర్చకులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాముల ఆధ్వర్యంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో అంజన రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, అర్చకులు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేసి ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
