ఇందిరాగాంధీ చిత్రపటానికి మంత్రుల నివాళులు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 18 : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆమె చిత్రపటానికి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తదితర ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేశ అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలను, దేశం కోసం ఆమె చేసిన త్యాగాలను మంత్రులు గుర్తు చేసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
