హరీశ్‌రావుపై టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టుసాయి విమర్శలు

హరీశ్‌రావుపై టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టుసాయి విమర్శలు

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 18 :  బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టుసాయి తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేటకు హరీశ్‌రావు చీడపీడలా మారారని, ఆయన హయాంలో భూదందాలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టుల భూసేకరణ సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. సిద్దిపేటలో పేదలకు పెన్షన్లు అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనతో గతంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే హరీశ్‌రావు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 1983లో అనంతుల మదన్‌మోహన్‌రావు తర్వాత మళ్లీ సిద్దిపేటలో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావుకు ఓటమి తప్పదని మెట్టుసాయి వ్యాఖ్యానించారు.