నార్సింగి పసిఫికా హిల్‌క్రెస్ట్‌లో అగ్నిప్రమాదం

నార్సింగి పసిఫికా హిల్‌క్రెస్ట్‌లో అగ్నిప్రమాదం

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 19 :  రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్‌ హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌ భవనంలోని ఒక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భవనం వెలుపలి భాగమంతా దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. ఎత్తైన భవనంలో మంటలు కనిపించడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఎవరైనా గాయపడ్డారా? ఆస్తి నష్టం ఎంత జరిగింది? అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.