బంగారం ప్రియులకు భారీ గుడ్ న్యూస్

బంగారం ప్రియులకు భారీ గుడ్ న్యూస్

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 19 :  బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. వరుస తగ్గుదలతో పసిడి ధరలు దిగివస్తుండగా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. గురువారం హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,30,690 పలికింది. బుధవారం ధర రూ.1,33,260 ఉండగా ఒక్కరోజే రూ.2,570 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,19,800కు చేరింది. నిన్నటితో పోలిస్తే రూ.2,350 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98,020గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.1,80,000కు చేరింది. బుధవారం రూ.1,85,000 ఉండగా రూ.5,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల కదలికలు, డాలర్‌ బలోపేతం, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఆభరణాల కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అయితే ఆభరణాల ధరలకు జీఎస్టీ, తరుగు, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయని వ్యాపారులు సూచిస్తున్నారు.