కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు

మునుగోడు, వెలుతురు, నవంబర్ 20 : ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్యనేతలు హుందాగా మాట్లాడాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అధికార అహంకారంతో ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని రాశారు. అదృష్టంతో దక్కిన అధికారంతో అవినీతికి పాల్పడి, ప్రజా అవసరాలు మరచిపోతే తెలంగాణ ప్రజలు, చరిత్ర క్షమించవన్నారు. హామీలు అమలు చేసేలా నేతలకు ఆత్మపరిశీలన జ్ఞానం ఇవ్వాలని అయ్యప్పస్వామిని కోరుతున్నానని చెప్పారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.