హైదరాబాద్కు ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి బీఎం సందీప్ కుమార్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 22:
ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జిగా నియమితులైన బీఎం సందీప్ కుమార్ తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫయీమ్, నాయకులు రోహిన్ రెడ్డి, కిషోర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు విమానాశ్రయానికి చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు.
