ఐదు జిల్లాల్లో నేడు పల్స్ పోలియో
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 22 : రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హనుమకొండ జిల్లాల్లో నేడు ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు 18,01,698 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా 7,602 బూత్‌లను ఏర్పాటు చేశారు. 245 మొబైల్ బృందాలు, 245 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. నవంబర్ 23, 24 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనుండగా, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మూడు జిల్లాల్లో నవంబర్ 25 వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఒక్క చిన్నారిని కూడా వదిలిపెట్టకూడదని మంత్రి దామోదర్ రాజనర్సింహ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గత 18 ఏళ్లుగా తెలంగాణలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, 2007లో హుజూర్‌నగర్‌లో చివరి కేసు నమోదైందని తెలిపారు.
