కష్టపడి పనిచేసే వారికే పార్టీ పదవులు ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 23 : బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వచ్చేముందు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన పనులపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు వివరించాలని అన్నారు.
గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులను ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ఆర్ఆర్ఆర్కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లినప్పటికీ, దానిని కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టకుండా పెండింగ్‌లో ఉంచారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 90 సీట్లు వస్తాయని, తన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే 100కు పైగా స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికల ఫలితాలే తమ బలాన్ని స్పష్టం చేస్తాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తగిన పదవులు కల్పించే అంశాన్ని పార్టీ ఇంచార్జితో చర్చిస్తానని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ముఖ్యమంత్రే ఓట్ల చోరీ జరుగుతోందని వ్యాఖ్యానించారని మంత్రి ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
