గోదావరి పుష్కరాల లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు

గోదావరి పుష్కరాల లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు

విజేతలకు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల బహుమతులు

హైదరాబాద్, నవంబర్ 23 :  గోదావరి పుష్కరాలు-2027 ప్రచారానికి సంబంధించిన లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పన పోటీలపై జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం వర్క్‌షాప్ నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఔత్సాహిక కళాకారులు, డిజైనర్లు తమ సృజనాత్మకతను చాటుకునేలా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్లను godavaripushkaralutg\@gmail.com కు పంపాలని సూచించారు. ఉత్తమంగా ఎంపికైన మూడు డిజైన్లకు వరుసగా రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.