పౌల్ట్రీ రంగం సమస్యలను పరిష్కరిస్తాం : సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 25 : పౌల్ట్రీ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అనుమతులు త్వరగా మంజూరు చేయడానికి సింగిల్ విండో విధానం తీసుకొస్తామన్నారు. పౌల్టీ రంగం ఎదుర్కొంటున్న దాణా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ జరుగుతున్న పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో -2026 లో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశాలు, సదస్సుల కోసం కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఫ్యూచర్ సిటీలో స్థలం కేటాయిస్తామన్నారు. ఇందుకోసం గ్లోబల్ సమిట్ వేదికగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. దాణా సమస్యను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పాలసీ పక్షవాతం లేదని పెట్టుబడులకు ఎప్పుడూ రక్షణ ఉంటుదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో పౌల్ట్రీ రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం తెలిపారు.
