డ్రగ్స్ పరీక్షలో ఆరుగురికి గంజా పాజిటివ్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 25 : పీజీ హాస్టళ్లలో గంజా వాడకంపై ఈగల్ అధికారుల దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉంటున్న 8 మంది అనుమానితులకు డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. వారిలో ఆరుగురికి గంజా పాజిటివ్ వచ్చింది. వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉండటం గమనార్హం.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, కొండాపూర్ ఐటీ హబ్‌లలో పీజీలపై ఈగల్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పీజీ హాస్టళ్లలో డ్రగ్ పెడ్లర్లు చురుగ్గా ఉన్నారని అధికారుల గుర్తించారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు.
