కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హైకోర్టులో పిల్

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హైకోర్టులో పిల్

 

హైదరాబాద్‌, వెలుతురు , నవంబర్ 25 : కూకట్‌పల్లి హుడా ట్రక్ పార్క్‌కు కేటాయించిన భూముల వేలం ప్రతిపాదనను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైనట్లు సమాచారం. ప్రజా అవసరాల కోసం సేకరించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం చట్టవిరుద్ధమని, వాటిని నిర్దేశిత ప్రయోజనాలకే వినియోగించాలని పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.

 

మూసాపేట పరిధిలోని ట్రక్ పార్క్‌కు సంబంధించిన 3.15 ఎకరాల భూమిని నవంబర్ 27న వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ భూమిని గతంలో ట్రక్ పార్క్ ఏర్పాటు కోసం సేకరించారని, వేలం వల్ల ట్రాన్స్‌పోర్టు రంగంపై ఆధారపడిన డ్రైవర్లు, కార్మికుల జీవనోపాధికి ఇబ్బందులు ఎదురవుతాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, వామపక్షాలు, స్థానిక ప్రజలు వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆందోళనలు చేపడుతున్నారు.