ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై రోడ్డు ప్రమాదం.. 4గురు విషమం

ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై రోడ్డు ప్రమాదం.. 4గురు విషమం

ఖమ్మం, వెలుతురు, నవంబరు 28 :

ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తల్లాడ మండలం రామంజవరం గ్రామ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై ఆగి ఉన్న లారీని మోజో ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

 

హైదరాబాద్‌ నుంచి కాకినాడకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.