సుప్రీంకోర్టుకు విజయ్ ప్రభుత్వం క్షమాపణలు
న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 25: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై సంప్రదాయ దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించకపోవడంపై ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపింది. నవంబర్ 24న దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేకపోయినందుకు మదురై జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణన్ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి దీపం వెలిగించే బృందానికి అనుమతి ఇవ్వకపోవడంతోనే ఆదేశాలను అమలు చేయలేకపోయామని నివేదికలో వివరించారు. ఈ వ్యవహారంపై దాఖలయ్యే ధిక్కరణ పిటిషన్ను విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన కేసును వచ్చే ఏడాది జనవరిలో విచారించనున్నట్లు తెలిపింది.
