స్థిరంగా బంగారం, వెండి ధరలు 

స్థిరంగా బంగారం, వెండి ధరలు

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 29:

 

తెలంగాణలో ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,27,860గా నమోదైంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95,890గా ఉంది.

 

ఇక వెండి ధర కిలోకు రూ.1,70,000గా కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లోనూ ఇదే స్థాయిలో ధరలు నమోదైనట్లు మార్కెట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 

శనివారంతో పోలిస్తే ఆదివారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. అయితే స్థానిక నగల దుకాణాలు, మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. బంగారు ఆభరణాల కొనుగోలుపై జీఎస్టీ, తరుగు, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయి.