- దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- హైదరాబాద్ మహానగరంలో కన్నుల పండువగా బోనాలు
- పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు
- వచ్చిన భక్తులందరికీ అమ్మవారి దర్శనం కల్పించాలి
- భక్తులతో కిక్కిరిసిన లాల్ దర్వాజా ప్రాంతం
- అమ్మవారికి బోనంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 09:
ఆషాడ బోనాల జాతరలో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లతో కలసి అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు అలాగే కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ బోనాలకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ బోనాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ప్రభుత్వం రూ. 20 కోట్లు నిధులు మంజూరు చేసి హైదరాబాద్ బోనాలను వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నామని, భక్తులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలు అన్ని దేవాలయాల్లో దర్శించుకుంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం భవిష్యత్తులో కూడా బోనాల జాతరాలను ఇంకా మెరుగైన రీతిలో చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అలాగే సింహవాహిని మహంకాళి దేవాలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగా గత నెల నుండి హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖ అధికారులు నిబద్ధతతో అలాగే బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని అధికారులని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
అమ్మవారి ఆశీస్సులు తెలంగాణపై ఉండాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సుభిక్షంగా ముందుకు తీసుకవెళ్లాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని అలాగే రైతాంగం సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నెలరోజు బోనాలలో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా అనేక కళా ప్రదర్శనలు చేపట్టామని అన్నారు. అలాగే చివరి భక్తునికి కూడా దేవాలయాల్లో దర్శనం కల్పించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని స్పష్టం చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు తప్పక ఉండాలని, ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగా అన్ని దేవాలయాల్లో బోనాలను ఎంతో ప్రతిష్టంగా నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే అన్ని దేవాలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతాంగం సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని హైకోర్టు జడ్జి ఎస్. నంద, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి, శాసనసభ్యులు ఠాగూర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు , వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, హైదరాబాద్ సిపి సజ్జనార్, డిసిపి, స్పెషల్ ఆఫీసర్ రవి, ఆర్డీవో రామకృష్ణ, వివిధ విభాగాల అధికారులు, భక్తులు, ప్రముఖులు తదితరులు దర్శించుకున్నారు.


