హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 09:
గౌలిగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు (ప్రజా సంబంధాలు & ప్రోటోకాల్) హర్కర వేణుగోపాల్ రావు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని హర్కర వేణుగోపాల్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
