ప్రజావాణిలో మంత్రి ఆకస్మిక తనిఖీ

ప్రజావాణిలో మంత్రి ఆకస్మిక తనిఖీ

 

హనుమకొండ, వెలుతురు, నవంబర్ 16 :  భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా రికార్డు చేయాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మండలంలో ఆయిల్‌పామ్ సాగు, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్, విద్యుత్, విద్యా, వైద్య రంగాల సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, పరిష్కారాలు, పెండింగ్ వివరాలతో వారంవారీ నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రజావాణి సమయంలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.