రైతులు, ఉపాధ్యాయులపై కేసుల ఎత్తివేత

రైతులు, ఉపాధ్యాయులపై కేసుల ఎత్తివేత

 

చెన్నై, వెలుతురు, నవంబర్ 16 :   రైతులు, ఉపాధ్యాయులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం గతంలో శాంతియుతంగా నిరసనలు చేపట్టిన సుమారు 92 వేల మందిపై నమోదైన పోలీసు కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసుల ఉపసంహరణకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 2న అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీని అమలు చేస్తూ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుదీర్ఘకాలంగా కేసులు ఎదుర్కొంటున్న రైతులు, ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది.