ప్రజాప్రతినిధులు, ప్రజలకు పీఆర్‌ఓలు వారధులు

హైదరాబాద్‌, వెలుతురు, అక్టోబర్ 05 :

వద్ద పనిచేస్తున్న ప్రజా సంబంధాల అధికారుల (పీఆర్‌ఓ) కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే భవన్‌లో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య పీఆర్‌ఓలు వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంతో పాటు సమాచార మార్పిడిని వేగవంతం చేసేలా పీఆర్‌ఓలు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారంలో పీఆర్‌ఓలు క్రియాశీలక పాత్ర పోషించాలని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.