నూతన జిల్లాలతో ప్రజల ముంగిటకు పాలన : కేటీఆర్

నూతన జిల్లాలతో ప్రజల ముంగిటకు పాలన : కేటీఆర్

 

హైదరాబాద్‌ : తెలంగాణ సాధించి స్వపరిపాలన అందించిన కేసీఆర్‌ నూతన జిల్లాల ఏర్పాటుతో పాలనను మరింత ప్రజలకు చేరువ చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి అధికార వికేంద్రీకరణ చేపట్టడంతో ప్రజల ముంగిటకే పాలన వచ్చిందని పేర్కొన్నారు.

కొత్త జిల్లాలతో గతంలో 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారిందని, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య, విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, వాటి ప్రత్యేకతలకు అనుగుణంగా నామకరణం చేశారని కేటీఆర్‌ పేర్కొన్నారు. నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.