విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి : రాంచందర్‌రావు
హైదరాబాద్ : సర్ ప్రక్రియపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. అన్ని రకాల విచారణల తర్వాతే ఓటు తొలగిస్తారని, 13 కోట్ల మంది ఓట్లు ఇంకా పూర్తిగా తొలగించలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 13 కోట్లలో 2.89 కోట్ల ఓట్లు డూప్లికేషన్‌వి అన్న ఆయన, ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే మళ్లీ ఓటు ఇస్తున్నారని స్పష్టం చేశారు.
